Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'బిగ్ బాస్' కోసం హరితేజ కంటే ముందుగా నన్నే అడిగారు .. సీజన్ 2 తప్పకుండా చేస్తాను: సింగర్ గీతామాధురి

  • 'బిగ్ బాస్' కోసం నన్ను అడిగిన మాట నిజమే 
  • ఎలా ఉంటుందోననే భయంతో వెళ్లలేదు
  • ఆ తరువాత చూశాను .. బాగా నచ్చింది 
  • ఈ సారి ఛాన్స్ వదులుకోను                 
గాయనిగా గీతామాధురికి ప్రత్యేకమైన గురింపు వుంది. కొన్ని పాటలు ఆమె పాడితేనే బాగుంటుందనే ఉద్దేశంతో, ఆ పాటలను ఆమెతోనే పాడించేవారున్నారు. అలాంటి గీతామాధురి తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో అనేక విషయాలను ముచ్చటించింది. ఈ సందర్భంలోనే ఆమె 'బిగ్ బాస్' కార్యక్రమాన్ని గురించిన ప్రస్తావన తీసుకొచ్చింది.

" 'బిగ్ బాస్' కోసం నన్ను అడిగినప్పుడు హరితేజ నా పక్కనే వుంది .. అప్పటికి తననింకా అడగలేదు. అసలు షో ఏమిటనేది నాకు తెలియదు .. తాను చెప్పింది ఇలా ఉంటుంది .. అలా ఉంటుందని. నేనేమో షో చూడలేదు .. నన్ను అందరూ భయపెట్టేశారు .. దాంతో చేయలేదు. ఆ తరువాత చూడటం మొదలుపెట్టాను .. చాలా నచ్చింది. అప్పుడు అనుకున్నాను .. అయ్యో చేసి ఉండాల్సిందేనని. మా ఇంట్లో వాళ్లు ఇప్పటికీ ఏడిపిస్తుంటారు .. నువ్వెళ్లి వుంటే హరితేజలా చేసేదానివని .. అర్చనలా చేసేదానివని. 'బిగ్ బాస్' సీజన్ 2 కి పిలిస్తే మాత్రం తప్పకుండా వెళతాను" అంటూ చెప్పుకొచ్చింది.       
geetamadhuri

More Telugu News